
Vishthapana Vidhwamsam (Telugu Edition)
Échec de l'ajout au panier.
Échec de l'ajout à la liste d'envies.
Échec de la suppression de la liste d’envies.
Échec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Acheter pour 16,18 $
-
Narrateur(s):
-
Sri Lalitha
-
Auteur(s):
-
K.Balagopal
À propos de cet audio
1990 ల తర్వాత ప్రభుత్వాల అభివృద్ధి విధానాలు పేదల ఫై సునామీలా ఎలా విరుచుకుపడ్డాయో తెలుగునేల మీద ప్రతిపాదించబడిన ఒక్కొక్క సేజు ను కారిడార్ ను పరిశ్రమను ప్రాజెక్టును తీసుకుని వివరంగా వ్యాసాలు రాసారు బాలగోపాల్. ఆ వ్యాసాలన్నిటినీ కిలిపి ఐదు పుస్తకాలుగా తీసుకొస్తున్నట్టు గత ఏడాది ప్రచురించిన అభివృద్ధి — విధ్వంసం పుస్తకంలో తెలియజేశాం.
ఆ సిరీస్ లో ఇది రెండవది. అభివృద్ధి మంచిచెడుల మీద బిన్నాభిప్రయాలున్న వారికి సహితం ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటుందనుకుంటున్నాం. అది ఈ ప్రోజెక్టుల వల్ల జరుగుతున్న విస్తాపన.ఊర్లకు ఊర్లు ఖాళీ చేయాల్సి రావడం ప్రజలకు జరుగుతున్న నష్టానికి వారికి లభిస్తున్న పరిహారానికి పొంతన లేకపోవడం పునరావాసమనేదే చట్టంలో ఇప్పటికీ ఒక హక్కుగా లేకపోవడం ప్రజల అసంతృప్తి ఉద్యమంగా మారినప్పుడు దానిని కఠినంగా అణిచివేయాలని చూడడం... ఇవన్నీ గత 20, 30 ఏళ్లులో అనేకచోట్ల చూశాం.
ఇంకా చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి కోసం విస్తాపన అనివార్యమని భావించేవాళ్ళు కూడా వీరి పరిస్థితి పట్ల సానుభూతి చూపగలరు. కానీ ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించారు. ఇటువంటి అభివృద్ధి అసలు అవసరము అని ఆలోచించారు. కంపెనీలకు వచ్చే లాభాన్ని , వారి అభివృద్ధిని 'దేశం అభివృద్ధి' గానో , 'రాష్ట్ర అభివృద్ధి' గానో పిలిచేవారు నిర్వాసితులయ్యే వేలాది ప్రజలకు కలిగే నష్టాన్ని దేశం నష్టంగానూ , రాష్ట్ర నష్టంగానూ భావించి దేశం లేక రాష్ట్రం దానిని భరించాలని ఎందుకు అడగరు? అటువంటి చట్టం గానీ విధానం గానీ దేశంలో ఎందుకు లేదని ఎందుకు అడగరు ఉన్నవాళ్ల అభివృద్ధి కోసం లేనివాళ్లు పూర్తిగా పతనం అయ్యే ప్రగతిని మనం ఎందుకు అంగీకరించాలి?
Please note: This audiobook is in Telugu.
©2022 Storyside IN (P)2022 Storyside IN